Friday, October 24, 2025
E-PAPER
Homeజాతీయంత‌మిళ‌నాడులో భారీ వ‌ర్ష‌పాతం న‌మోదు..

త‌మిళ‌నాడులో భారీ వ‌ర్ష‌పాతం న‌మోదు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఈశాన్య తిరోగ‌మ‌న ప‌వ‌నాలతో త‌మిళ‌నాడులో ప‌లు రోజులుగా కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేది, క‌రైకాల్ ప్రాంతాల్లో భారీ వాన‌ల‌కు రోడ్లు చెరువుల‌ను త‌ల‌పించాయి. ప‌లు కాల‌నీల్లో వాన నీరు భారీ మొత్తంలో వ‌చ్చి చేరింది. దీంతో ఆయా ప్రాంతాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. అంతేకాకుండ ప‌లు ప్రాంతాల్లో రాక‌పోక‌లు స్తంభించిపోయాయి. త‌మిళ‌నాడులోని ప‌లు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లుగా భార‌త్ వాతావార‌ణ శాఖ పేర్కొంది. తిరువ్వేలి, తిరువ‌ల్లుర్, పిచ్చాపారాయి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసిన్న‌ట్లు ఐఎంసీ డేటా రిలీజ్ చేసింది. రాష్ట్రంలో ఈశాన్య రుతుప‌వ‌నాలు చురుక‌గా క‌దులుతున్నాయ‌ని, దీంతో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయని ఐఎంసీ సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -