నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం పడుతోంది. ఉదయం నుంచి ఎండలు కొట్టగా ఒక్కసారిగా మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో పెను మార్పులు సంభవించి..జోరుగా వాన కురుస్తోంది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి నగరంలోని పలు కాలనీలు చెరువులను తలపించాయి. రోడ్లమీద వరద నీరు యేరుల పరుగులు తీసింది. భారీ వరద నీటికి రోడ్లలన్ని జలమయమైయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా కాలనీల్లో నడుంలోత్తు వరదు నీరు చేరింది. పలు ఇండ్లోకి నీరు చేరటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన నగరపాలక సంస్థ..యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాల్లో విపత్తు దళంతో సాయక చర్యలు చేపట్టారు. మోటర్ల సాయంతో నీటిని నాలాలోకి తరలించారు. అంతేకాకుండా ఆఫీస్ ముగింపు వేళల్లో వర్షం రావడంతో హైటెక్ సిటీ, మాదాపూర్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్, నాంపల్లి, గాంధీభవన్, లిబర్టీ, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాపిక్ జాం అయింది.
హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES