Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్భారీ వర్షాలు.. అంబులెన్సులు, వాటర్ ట్యాంకర్లు, ఆహారం ఏర్పాటు

భారీ వర్షాలు.. అంబులెన్సులు, వాటర్ ట్యాంకర్లు, ఆహారం ఏర్పాటు

- Advertisement -

– టీపీసిసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
నవతెలంగాణ –  కామారెడ్డి
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నాలుగు అంబులెన్సులు, మూడు వాటర్ ట్యాంకర్లు, ఆహారం ఏర్పాటు చేయడం జరిగిందని టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం జిఆర్ కాలనీ విద్యానగర్ కాలనీ  సహాయక చర్యల్లో టీపీసిసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ముందుండి పర్యవేక్షించారు. కామారెడ్డి పట్టణంలోని  నియోజకవర్గం గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తీవ్ర ప్రభావానికి గురవుతోంది.

వాగులు, వంకలు పొంగిపొర్లడంతో కామారెడ్డి జి ఆర్ కాలనీలోని  జలమయం కాగా, రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని భావించిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, కామారెడ్డి,అన్ని మార్గాలు వరదల కారణంగా మూసివేయబడ్డాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితులను వివరించారు.  ప్రజలకు తక్షణ సహాయక చర్యలు అందించేందుకు అధికారులను ఆదేశించడం జరిగింది.

ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే స్పందించి ప్రజలకు సహాయం అందించాలి. మానవతా దృక్పథంతో స్పందించడం మనందరి బాధ్యత అన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ  చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు ఏ ఇబ్బంది మాకు ఫోన్ చేయగలరు, అత్యవసరం కోసం నాలుగు అంబులెన్సులు, మూడు వాటర్ ట్యాంకర్లు, ఆహారం ఏర్పాటు చేసాం అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ తాజా మున్సిపల్ చైర్పర్సన్, గడ్డం ఇందుప్రియ, మాజీ తాజా కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad