నవతెలంగాణ కల్వకుర్తి టౌన్
కల్వకుర్తి పట్టణంలో వర్షం దంచి కొడుతుంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఆకాశం మబ్బులుగా కమ్ముకొని భారీ వర్షం కురిసింది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పత్తి వేరుశనగ వరి తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. పట్టణంతోపాటు మండలంలో వివిధ గ్రామాల్లో భారీ వర్షాలతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యంగంపల్లి రాచూర్ మధ్య ఉన్న పాండయ్య కయ్య వద్ద వరద ప్రవాహం ఎక్కువ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కల్వకుర్తి పట్టణంలో పలు కాలనీలు నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో నీటిని తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్, కల్వకుర్తి పోలీసులు సీఐ నాగార్జున ఎస్సై మాధవరెడ్డి సిబ్బందితో కలిసి కాలనీలలో నిల్వ ఉన్న నీటిని తొలగించేందుకు జెసిబి తో పనులు చేస్తున్నారు.
అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. అధిక వర్షాలకు పాడైన రోడ్లను బాగు చేయాలని వాహనదారులు వేడుకుంటున్నారు.



