- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని చెప్పారు.పాత ఇళ్లలో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.
.
- Advertisement -