Friday, September 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుభారీ వ‌ర్షాలు..సీఎం రేవంత్‌రెడ్డి కీల‌క ఆదేశాలు

భారీ వ‌ర్షాలు..సీఎం రేవంత్‌రెడ్డి కీల‌క ఆదేశాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ముఖ్యంగా హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో.. లోతట్టు ప్రాంతాల వారు.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, రాష్ట్రంలో భారీ వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు సీఎం.. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు.. ఇక, సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని.. ఆ దిశగా సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలని సీఎస్‌ను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -