Wednesday, October 1, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంచైనాలో భారీ వర్షాలు..నలుగురు మృతి

చైనాలో భారీ వర్షాలు..నలుగురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: చైనాలో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. సోమవారం ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడడం వల్ల నలుగురు మృతి చెందారు. 8 మంది గల్లంతయ్యారని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అలాగే చైనాలో చెంగ్డే నగరంలో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి.

కాగా, హెబీలో శనివారం రికార్డుస్థాయిలో వర్షం కురిసింది. తాజాగా సోమవారం కొండచరియలు విరిగిపడిన సంఘటనా స్థలాన్ని పరిశీలించడానికి బృందాన్ని పంపినట్లు జాతీయ అత్యవసర నిర్వహణ విభాగం వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -