Sunday, November 9, 2025
E-PAPER
Homeజాతీయంకేరళలో భారీ వర్షాలు..తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

కేరళలో భారీ వర్షాలు..తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్: కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ ఐదు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఎర్నాకులం, ఇడుక్కి, త్రిస్సూర్‌, కన్నూర్‌, కాసరగోడ్‌ జిల్లాకు భారత వాతావరణ శాఖ శనివారం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఇక మిగిలిన తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. 11 నుంచి 20 సెంటిమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉన్నప్పుడు ఆరెంజ్‌ అలర్ట్‌.. 6 నుంచి 11 సెంటిమీటర్ల వరకు కురిసే వర్షపాతానికి ఎల్లో అలర్జ్‌ను ఐఎండి జారీ చేస్తుంది. ఇలాంటి వాతావరణం నేపథ్యంలో 40 కిలోమీటర్ల మేర బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు రాజస్థాన్‌లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రతినిధి శనివారం తెలిపారు. ఉదరుపూర్‌, జోదాపూర్‌లో రాబోయే ఐదు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోటా, అజ్మీర్‌, జైపూర్‌, భరత్‌పూర్‌, బికనీర్‌లలో తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే పశ్చిమ రాజస్థాన్‌లో మోస్తారు వర్షం.. కొన్ని ప్రదేశాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. గడచిన 24 గంటల్లో పాలి జిల్లాలో బాలిలో 70 మి.మీ వర్షపాతం నమోదైందని ఐఎండి పేర్కొంది.
వర్షాకాల ప్రారంభమైనప్పటి నుండి (జూన్‌ 20) హిమాచల్‌ ప్రదేశ్‌లో 257 మంది చనిపోయారు. 37 మంది గల్లంతయ్యారని హిమాచల్‌ ప్రదేశ్‌ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -