నవతెలంగాణ-హైదరాబాద్: దేశరాజధానిలో శనివారం భారీ వర్షాలు కురిసాయి. పలు రోజుల నుంచి అధిక ఎండలతో అల్లాడిపోతున్న ఢిల్లీ వాసులు..తాజాగా కురిసిన వానాలకు కాస్తా ఉపశమనం పొందారు. చల్లటి గాలులు జనాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించగా..పలు చోట్ల విషాదానింపాయి. నోయిడా పరిసర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలలు నానా బీభత్సం సృష్టించాయి. దీంతో ర్యాపిడ్ రైల్వే మెట్రో ఈ ఈదురు గాలులకు స్వల్పంగా దెబ్బతింది. అదే విధంగా డీఎం చౌక్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ విరిగి నేలకూలింది. అంతేకాకుండా పలు కాలనీల్లో చెట్లు నేలకులాయి. ఆయా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించి పోయాయి. అప్రమత్తమైన ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసింది. మరోవైపు ఈ తరహా వాతావరణ పరిస్థితులు వారం పాటు కొనసాగుతుందని, రానున్న ఐదు రోజుల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

