- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పలు రోజులుగా యూపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంగా, యమునా నదులకు వరద నీరు పోటెత్తింది. దీంతో ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. వరద కారణంగా శివకుటి ప్రాంతంలోని ఇళ్లన్నీ నీట మునిగాయి. మరికొన్ని చోట్ల నివాస గృహాల్లోకి నీరు చేరడంతో స్థానికులు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. వరద ముప్పు దృష్ట్యా NDRF బృందం ప్రయాగ్ రాజ్ చేరుకుని ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -