నవతెలంగాణ-హైదరాబాద్: భాతర్ వాతావరణ శాఖ(IMD) కీలక హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయని ముందస్తుగా వెల్లడించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో రాష్ట్రాల్లో అధిక వర్షాలు పడ్డనున్నాయని సూచించింది.
మహారాష్ట్రలోని మంబై థానే, పహల్గార్, రాయిగడ్, రత్నగిరి తదితర జిల్లాలో భారీ స్థాయిలో వర్షపాతం నమోదు కానుందని తెలిపింది. తీవ్రమైనా ధూలితో కూడిన గాలులు గంటలకు 60కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయని ఐఎండీ పేర్కొంది. ఈ హెచ్చరిక రాబోయే మూడు గంటల వరకు చెల్లుతుందని, నివాసితులు ఇంటి లోపలే ఉండాలని, లోతట్టు ప్రాంతాలు లేదా వరదలు వచ్చే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని IMD సూచిందింది.
అదే విధంగా మధ్యప్రదేశ్‌లోని సాగర్, బాల్‌ఘాట్లో భారీ వర్షాలతో పాటు పిడుపాటు సంభవించే ప్రమాదం పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు భారీ వర్షాలతో విమాన కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఇండిగో పేర్కొంది. విమాన షెడ్యూల్‌లో ఏవైనా మార్పులు ప్రయాణికులకు రిజిస్టర్డ్ నెంబర్ల ద్వారా సమాచారం అందిస్తామని పేర్కొంది. విమానాశ్రయానికి వెళ్లే ముందు తమ వెబ్‌సైట్ లేదా యాప్‌లో ప్రయాణికుల విమాన స్థితిని తనిఖీ చేయాలని సూచించింది. నీటి ఎద్దడి నెమ్మదిగా కదిలే ట్రాఫిక్ అవకాశం ఉన్నందున, ప్రయాణానికి కొంత అదనపు సమయం పడుతుందని తెలిపింది.
ఇప్పటికే కురుస్తున్ వర్షాలకు ముంబైలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.
మంగళవారం ముంబై, దాని శివారు ప్రాంతాలు మరియు దాని మెట్రోపాలిటన్ ప్రాంతంలోని టౌన్‌షిప్‌లలో వర్షాలు కురిశాయి. అనేక చోట్ల వీధులు జలమయమయ్యాయి. రుతుపవనాల వర్షాలను ఎదుర్కోవడంలో ఆర్థిక రాజధాని యొక్క వార్షిక సవాలును మరోసారి ఎదుర్కొంది. మంగళవారం సాయంత్రం ముంబైలోని స్టేషన్ల మధ్య కుండపోత వర్షం కురుస్తున్న సమయంలో రెండు రద్దీగా ఉండే మోనోరైల్ రైళ్లు ఇరుక్కుపోవడంతో ప్రయాణికులు భయాందోళనలు గురైయ్యారు. 782 మంది ప్రయాణికులను సురక్షితంగా పంపేశారు.