నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు వేర్వేరు చోట్ల ఇళ్ల గోడలు కూలి ముగ్గురు మహిళలు మృతి చెందారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి బుధవారం ఉదయం 10.30 గంటల సయమంలో కడలూరు జిల్లాలో పుదుచత్రం సమీపంలో అందర్ముల్లిపల్లెంలో ఇంటి గోడ కూలి అశోత్తై (69), ఆమె కుమార్తె జయ (40) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరు వ్యవసాయ కూలీలు. పోస్టుమార్టం నిమిత్తం వీరి మృతదేహాలను పరంగిపెట్టై జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇటువంటిదే మరో ఘటన కళ్లకురిచ్చి సమీపంలోని కొంగరపాళయంలో ఇంటి గోడ కూలి వనమయిలి అనే ఓ 60 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
తమిళనాట కురుస్తున్న వర్షాలకు 24,149 మంది నిరాశ్రయులయ్యారు. వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం 215 సహాయక శిబిరాలు, 106 కమ్యూనిటీ కిచెన్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
భారీ వర్షాలు..గోడలు కూలి ముగ్గురు మహిళలు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES