నవతెలంగాణ-హైదరాబాద్: హిమాలయాలకు అతి సమీపంలో ఉన్న సిక్కం రాష్ట్రంలో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. ఎడాతెరిపి లేకుండా కురుస్తున్నా భారీ మంచు రహదారులను కమ్మేసింది. దీంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అకాల మంచుకు స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాథులా పాస్ నుంచి చీనాగ్ లేక్ మార్గంలో రోడ్లపై భారీగా మంచు గుట్టలుగా పేరుకపోవడంతో దాదాపు 324 వాహనాలు 15 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
అప్రమత్తమైన భారత సైన్యం హిమపాతం కారణంగా చిక్కుకున్న వాహనాలు,పర్యాటకులకు సహాయం చేసింది.ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల నుండి తిరిగి వస్తుండగా ఆకస్మిక హిమపాతంలో వాహనాలు చిక్కుకున్నాయి. ఈ రోజు జారీ చేయబడిన 540 పాస్‌లలో, తీవ్రమైన హిమపాతం ప్రారంభమయ్యే ముందు 216 వాహనాలు సురక్షితంగా తిరిగి వచ్చాయి. సిక్కింలోని గ్యాంగ్‌టాక్ జిల్లాలోని మైల్‌స్టోన్ 13, మైల్‌స్టోన్ 17 మధ్య జవహర్ లాల్ నెహ్రూ మార్గ్ (JNM) అక్షం నుండి సుమారు 200-250 వాహనాలు, 700-800 మంది పర్యాటకులకు సహాయం అందించి బయటకు తీసుకెళ్లారు.



