- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ హిమపాతం నమోదైంది. దీని కారణంగా శ్రీనగర్ విమానాశ్రయం పరిధిలో తేలికపాటి మంచు కురుస్తుండటంతో 50 విమానల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్ వే, ఇతర ప్రాంతాల్లో మంచు పేరుకుపోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విమానాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని, ప్రయాణికులు తమ విమాన సమయాల గురించి విమానయాన సంస్థలను సంప్రదించాలని విమానాశ్రయ అధికారులు హెచ్చరించారు.
- Advertisement -



