Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలువిజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన పెద్ద అంబర్ పేట వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) సమీపంలోని సంపూర్ణ హోటల్‌ ముందు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో సిటీ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఓఆర్‌ఆర్‌ సమీపం నుంచి కొత్తగూడెం వరకు హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img