హైదరాబాద్‌-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్..

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆ రాష్ట్ర ఓటర్లు స్వస్థలాలకు తరలి వెళ్తున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన అక్కడి వారంతా బయల్దేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. సొంత వాహనాల్లో వెళ్లేవారితో హైదరాబాద్‌- విజయవాడ హైవేపై పలుచోట్ల ట్రాఫిక్‌జామ్‌ అవుతోంది. మరోవైపు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారూ నగరం నుంచి స్వగ్రామాలకు బయల్దేరారు. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపైకి చేరుకోవడంతో పలుచోట్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. దీంతో హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది.

Spread the love