- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలోని బీచ్ సమీపంలో ఓ హెలికాప్టర్ అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోయింది. అప్పటి వరకు సాధారణంగా ప్రయాణించిన హెలికాప్టర్.. ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి గాల్లో గింగిరాలు తిరిగింది. కాసేపటికే అక్కడున్న చెట్లలో కూలిపోయింది. ఈ ఘటనలో హెలికాప్టర్‌లోని ఇద్దరికి, నేలపై ఉన్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.
- Advertisement -