Tuesday, April 7, 2026
E-PAPER
Homeజాతీయంసముద్రంలో పడిన హెలికాప్టర్‌..

సముద్రంలో పడిన హెలికాప్టర్‌..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఓ హెలికాప్టర్‌ మరికాసేపట్లో ల్యాండ్‌ అవుతుందనగా సముద్రంలో పడిపోయిన ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులతో పవన్‌ హాన్స్‌ హెలికాప్టర్‌ అండమాన్‌లోని పోర్ట్‌ బ్లెయిర్‌ నుంచి బయలుదేరింది. మాయాబందర్‌ రన్‌వేకి దాదాపు 300 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని పైలట్‌ సముద్రంలో క్రాష్‌ ల్యాండింగ్‌ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -