- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్‌లో ఒక హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించగా, అదుపుకోల్పోయి నేలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరికి మినహా మిగతా వారెవరికీ పెద్దగా గాయాలు కాలేదు. అందరూ స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. నేపాల్‌లో ఎయిర్ డైనాస్టి సంస్థకు చెందిన 9ఎన్ ఏఎఫ్‌క్యూ అనే హెలికాప్టర్ ఐదుగురు ప్రయాణికులతో నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి ఖోతాంగ్ జిల్లాకు బయల్దేరింది. అక్కడ బలబేసి అనే ప్రాంతంలో ల్యాండింగ్‌కు ప్రయత్నించింది. ఈ క్రమంలో హెలికాప్టర్ తోక భాగం ఊడిపోయింది. రెక్కలు విరిగిపోయాయి. అలా హెలికాప్టర్ బోల్తా కొట్టి, ధ్వంసమై ఆగిపోయింది.
- Advertisement -



