Tuesday, February 24, 2026
E-PAPER
Homeజాతీయంనికోబార్ దీవుల్లో హెలిక్టాపర్ అత్య‌వ‌స‌ర ల్యాండింగ్

నికోబార్ దీవుల్లో హెలిక్టాపర్ అత్య‌వ‌స‌ర ల్యాండింగ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: సాంకేతిక లోపంతో అండమాన్ నికోబార్ దీవుల్లో ఓ హెలికాప్ట‌ర్ అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ అయింది. పోర్ట్‌ బ్లెయిర్ (శ్రీ విజయ పురం) నుంచి ఉదయం 8.30-8.45 గంటల మధ్యలో హెలిక్టాపర్ బయలుదేరింది. ఈ హెలికాప్టర్‌ రోజూ పోర్ట్‌ బ్లెయిర్-రన్‌ఘాట్-మాయాబందర్ మధ్య ప్రయాణిస్తుంది. అయితే, ఉదయం హెలికాప్టర్‌ బయల్దేరిన తర్వాత సాంకేతిక సమస్యను పైలట్లు గుర్తించారు. దీంతో అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఉదయం 9.30 గంటల సమయంలో అండమాన్ నికోబార్ దీవుల్లోని సముద్రంలో మాయాబందర్‌కు దగ్గర్లో హెలికాప్టర్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ప్రదేశం హైవేకు 300 మీటర్ల దూరంలో ఉంది. హెలికాప్టర్ సముద్రంలో ల్యాండ్ అవ్వగానే అక్కడి సహాయక సిబ్బంది వారిని రక్షించారు. ఈ ఘటనలో హెలికాప్టర్‌లోని ఐదుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేవని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై అధికారులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -