నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవలె చారుదామ్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ యాత్రకు వచ్చే భక్తులకు హెలికాప్టర్ సౌకర్యాం కల్పించారు. ఈ సర్వీసులు ఉత్తరాఖండ్‌లోని సోనప్రయాగలో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. IRCTC ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు చెప్పారు. రోజుకు 150మంది భక్తులను ఆయా ఆలయాలకు తరలిస్తామన్నారు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పకబ్బందీగా భద్రతా చర్యలు తీసుకొని ఈ సర్వీసును ప్రారంభించామన్నారు. ఈ ఏడాది 22లక్షల మంది చార్‌దామ్ యాత్రకు కోసం రిషికేశ్ ట్రాన్సిట్ క్యాంప్ రిజిష్టర్ చేసుకున్నారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడితో కేంద్ర ప్రభుత్వం భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించింది. మరోవైపు పహల్గాం ఉగ్రదాడితో కేంద్రం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. ఈసారి చార్‌ధామ్ యాత్రకు పటిష్టమైన భద్రతను కల్పించనున్నారు. చార్‌ధామ్ యాత్ర మార్గాన్ని 15 సూపర్ జోన్‌లు, 41 జోన్‌లు, 217 సెక్టార్‌లుగా విభజించారు. ఈసారి యాత్ర మార్గంలో మొత్తం 624 సీసీటీవీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. తొమ్మిది మంది ఏఎస్‌పీ, డీఎస్పీ స్థాయి అధికారులను యాత్ర మార్గాల్లో మోహరించనున్నారు.
అక్షయ తృతీయ సందర్భంగా చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల్లో ఉండే యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను చార్‌ధామ్‌గా పేర్కొంటారు. ప్రతి ఏటా శీతాకాలంలో దాదాపు ఆరు నెలల పాటు మూసే ఉంటాయి. ఈ సందర్భంగా ఉత్తర్‌కాశీ జిల్లాలోని గంగోత్రి , యమునోత్రి ఆలయ ద్వారాలను ఉదయం 10:30 గంటలకు వేద మంత్రాల నడుమ తెరిచారు. ఇక శుక్రవారం రోజు కేదార్‌నాథ్ ఆలయం, ఆదివారం రోజున బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకోనున్నాయి. మంగళవారం ఉదయం 11.57 గంటలకు అభిజిత్ ముహూర్తంలో ముఖబా గ్రామం నుంచి గంగోత్రి ధామ్‌కు బయలుదేరిన గంగామాత్ర డోలి.. బుధవారం ఉదయం అక్షయ తృతీయ రోజున డోలి గంగోత్రి ధామ్ చేరుకుంది. అలాగే, యమున పల్లకీ ఈ ఉదయం ఖర్సాలిలోని తన శీతాకాల నివాసం నుంచి బయలుదేరి యమునోత్రి ధామ్‌కు చేరింది. ఇక సాంప్రదాయ కత్రువులు ముగిసిన అనంతరం 11:55 గంటల నుంచి భక్తులకు దర్శనార్థం అనుమతిస్తున్నారు.