Tuesday, January 6, 2026
E-PAPER
HomeNewsసమస్యల పరిష్కారానికి 'హలో ఆలూర్’

సమస్యల పరిష్కారానికి ‘హలో ఆలూర్’

- Advertisement -

8వార్డ్ లో ‘హలో ఆలూర్’ ప్రోగ్రామ్..

నవతెలంగాణ ఆర్మూర్

ఆలూర్ మండలం కేంద్రంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి దేశాల మేరకు ఆదేశాల తో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే లక్ష్యంతో ‘హలో ఆలూర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలూర్ గ్రామ సర్పంచ్ ముక్కెర విజయ్ సోమవారం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి సమస్యను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రతి సోమవారం ఒక వార్డులో పర్యటించి ప్రజలతో సమావేశమవుతామని అన్నారు. త్రాగునీరు, డ్రైనేజీ, రహదారులు, విద్యుత్, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి వేగంగా పరిష్కారం చూపిస్తామని పేర్కొన్నారు. ‘హలో ఆలూర్’ కార్యక్రమం ద్వారా ప్రజలకు పాలన మరింత దగ్గరగా తీసుకెళ్లడమే లక్ష్యమని, గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని సర్పంచ్ ముక్కెర విజయ్ తెలిపారు.ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని అని అన్నారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ మోహన్, వార్డు సభ్యులు భాస్కర్, సాయిలు, సంజీవ్,రంజిత్, సునీల్, నరేష్, అఖిల్, పంచాయతి కార్యదర్శి రాజలింగం, కరాబర్ సంతోష్, వాటర్ మెన్ సాయిలు, ఫీల్డ్ అసిస్టెంట్ పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -