Friday, July 25, 2025
E-PAPER
Homeబీజినెస్హెరిటేజ్‌ ఫుడ్స్‌

హెరిటేజ్‌ ఫుడ్స్‌

- Advertisement -

లివో యోగర్ట్‌ ఆవిష్కరణ
హైదరాబాద్‌:
ప్రముఖ డెయిరీ బ్రాండ్‌ హెరిటేజ్‌ ఫుడ్స్‌ కొత్తగా యువత ఆరోగ్య ఆకాంక్షలకు అనుగుణంగా లివో యోగర్ట్‌ను ఆవిష్కరించినట్టు తెలిపింది. దీనిని హైదరాబాద్‌లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రహ్మణి, ఆ సంస్థ సీఈఓ స్రీదీప్‌ కేసవన్‌ విడుదల చేశారు. ఈ నెక్స్ట్‌-జనరేషన్‌, ఆన్‌ ది గో యోగర్ట్‌ స్నాక్‌ రుచి, పోషకాహారం, సౌలభ్యాన్ని సమతుల్యం చేస్తూ ఆరోగ్యవంతమైన స్నాకింగ్‌ ఎంపికను అందిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. నగరంలోని విజేత, రత్నదీప్‌ రిటైల్‌ స్టోర్‌లలో తొలుత యోగర్ట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, మామిడి రుచులలో 90గ్రా కప్‌ ధరను రూ.30, క్లాసిక్‌ వేరియంట్‌ (చక్కెర లేనిది) రూ.40గా నిర్ణయించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -