– జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతులు
– మెడికవర్ హాస్పిటల్ వైద్యులు, ఎంబిబిఎస్, ఎండి(ఇంటర్నల్ మెడిసిన్) కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ దత్తు రాజ్
నవతెలంగాణ-కంఠేశ్వర్ : అకాల మరణాలకి అధిక రక్తపోటు ప్రధాన కారణం. అధిక రక్తపోటును నిశ్శబ్ద కిల్లర్ అని పిలుస్తారని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు, ఎంబిబిఎస్, ఎండి(ఇంటర్నల్ మెడిసిన్) కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ దత్తు రాజ్ తెలిపారు. స్పష్టమైన లక్షణాలు లేవు. అనారోగ్యకరమైన జీవనశైలి అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువ ఉప్పు (సోడియం) తినడం, అధిక బరువు ఉండటం, తగినంత వ్యాయామం చేయకపోవడం, అలాగే పొగాకు వాడటం వంటి వాటి వల్ల రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ.జన్యు సంబంధిత కారణాల వల్ల అధిక రక్తపోటు రావచ్చు. మన పూర్వీకులలో ఎవరికైనా చిన్న వయసులోనే రక్తపోటు వచ్చి ఉంటే ఆ కుటుంబ సభ్యులలో బీపీ వచ్చే అవకాశం ఎక్కువ.పొగాకు కారణంగా తాత్కాలికంగా బీపీ పెరగడమే కాకుండా, శాశ్వతంగా ధమనుల లైనింగ్ దెబ్బతిని రక్తపోటు జీవితకాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. ఉప్పు ఎక్కువగా తినడం మన ఆరోగ్యానికి పెద్ద ముప్పు. ఉప్పులో సోడియం అనే రసాయనం ఉంటుంది. ఈ సోడియం జీవకణాలలో నీటి నిల్వను పెంచి, రక్తపోటు కారణమవుతుంది. రెగ్యులర్ బిపి చెకప్ చేయించుకుంటే బిపి ఉంటే ఏం చేయాలి అనేది డాక్టర్ చెబుతారని ఒకవేళ బిపి ఉంటే తప్పనిసరిగా డాక్టర్ సూచించిన విధంగా రెగ్యులర్గా టాబ్లెట్ వేసుకోవాలి, బీపీ చెక్ చేసుకోవాలి, ఉప్పు తగిన మోతాదులో తీసుకోవాలి. రెగ్యులర్ వాకింగ్ చేయాలి.
అధిక రక్తపోటును నిశ్శబ్ద కిల్లర్ అని పిలుస్తారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES