- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో ప్రపంచ శాంతి ఉత్సవం నిర్వహించుకొనేందుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. సభలో వెయ్యి మందికి మించి ప్రజలు పాల్గొనరాదని పేర్కొంది. అలాగే ప్రార్థనలు మినహా ఇతర ప్రేరేపిత ప్రసంగాలు చేయరాదని సభ నిర్వహిస్తున్న గ్లోబల్ పీస్ ఫెస్టివల్‌కు తేల్చి చెప్పింది. సభ శాంతియుతంగా సాగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -