- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జాతీయ క్రీడా అభివృద్ధి కోడ్‌ను తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ పాటించడం లేదని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. పార్ట్ టైమ్ కోచ్‌లను తొలగించి.. ప్రముఖ క్రీడాకారులతో పూర్తి స్థాయి కోచ్‌లను నియమించాలని పిటిషనర్ పేర్కొన్నారు. పిల్‌పై విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.
- Advertisement -