- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కాళేశ్వరం నివేదిక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ ఇచ్చిన నివేదికపై హైకోర్టులో కేసీఆర్, హరీష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ ను మరోసారి పిటిషన్ తరపు న్యాయవాదులు మెన్షన్ చేశారు. కాళేశ్వంపై ధర్యాప్తు చేయాలని ఘోష్ నివేదికను సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కేసీఆర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. అనంతరం ఈ పిటిషన్ పై అత్యవసరంగా విచారించాలని న్యాయవాదులు కోరారు. అయితే కాళేశ్వరం నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 2కి వాయిదా వేసింది.
- Advertisement -