నవతెలంగాణ – హైదరాబాద్ : సంగీత దర్శకుడు ఇళయరాజా చట్టపరమైన ఇబ్బందుల్లో పడ్డారు. కొన్ని రోజులుగా ఆడియో సంస్థ ‘సరిగమ’కు, ఆయనకు మధ్య జరుగుతోన్న వివాదంలో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వచ్చేవరకూ 134 చిత్రాలకు సంబంధించిన పాటలను ఇళయరాజా వాడుకోవడానికి వీల్లేదని ఆదేశాలిచ్చింది.
అసలు ఎం జరిగింది అంటే..?
1976 నుంచి 2001 వరకూ ఇళయరాజా సంగీతం అందించిన 134 చిత్రాల హక్కులను నిర్మాతలు ‘సరిగమ’కు శాశ్వత ప్రతిపాదికన విక్రయించారు. తాజాగా ఇళయరాజా ఈ పాటలను ఉపయోగించవచ్చు అని కొన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు అనుమతులు ఇచ్చారు. ఈ క్రమంలో ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పాటలను వాడుకోవడానికి వీల్లేదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాత నుంచి కొనుగోలు చేసిన తర్వాత పూర్తి హక్కులు సరిగమకే ఉంటాయని కోర్టు తెలిపింది. వారి అనుమతి లేకుండా ఆ పాటలను ఉపయోగించకూడదని పేర్కొంది. గతేడాది విడుదలైన ‘అగత్యా’ సినిమాలోని ఓ పాట విషయంలో ఇళయరాజాకు, ‘సరిగమ’కు మధ్య వివాదం నెలకొంది.
ఇళయరాజాకు హైకోర్టు షాక్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



