Friday, May 9, 2025
Homeజాతీయంసరిహద్దుల్లో హై టెన్షన్‌

సరిహద్దుల్లో హై టెన్షన్‌

- Advertisement -

– విరుచుకుపడుతున్న పాక్‌ డ్రోన్‌ దాడులు..తిప్పికొడుతున్న సైన్యం
– పది పాక్‌ క్షిపణుల కూల్చివేత
– ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలనని సైన్యం హెచ్చరిక
– విద్యుత్‌ సరఫరా నిలిపివేత
శ్రీనగర్‌:
‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారత్‌ మెరుపు దాడులతో కకావికలమైన పాకిస్తాన్‌.. తన ఉనికిని చాటుకొనేం దుకు బరితెగించింది. జమ్మూ,పంజాబ్‌, రాజస్థాన్‌పై క్షిపణులతో తెగబడుతోంది. జమ్మూ ఎయిర్‌పోర్టు సమీపంలో పాకిస్తాన్‌ ఆత్మాహుతి డ్రోన్‌ దాడులకు పాల్పడినట్టు సమాచారం. సర్వసన్నద్ధంగా ఉన్న భారత సైన్యం పాక్‌ దాడుల్ని తిప్పికొడుతోంది. అఖ్నూర్‌, కిష్త్వార్‌, సాంబా సెక్టార్‌లో అధికారులు పూర్తిగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగిస్తున్నారు. ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీచేసింది. జమ్మూతో సహా పఠాన్‌కోట్‌, ఉధమ్‌ పుర్‌లలో ఈ దాడులు జరుగుతున్నట్టు సమాచారం. మరోవైపు సాంబా జిల్లాలో పాక్‌ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నట్టు సమాచారం. పలుచోట్ల భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి. అఖ్నూర్‌ సెక్టార్‌ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతు న్నాయి. పంజాబ్‌ సరిహద్దులోని ప్రాంతాలపై కూడా పాక్‌ డ్రోన్‌ దాడులకు దిగింది. మరో వైపు, పాక్‌ దాడులను భారత సైన్యం తిప్పికొడుతోంది. పది పాక్‌ క్షిపణులను నిర్వీర్యం చేసింది. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో రెండు డ్రోన్లను ధ్వంసం చేసినట్టు సమాచారం. మొత్తంగా ఇప్పటివరకు ఎనిమిది డ్రోన్లను నిర్వీర్యం చేసినట్లు తెలిసింది.
జమ్మూకాశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌లో హైఅలర్ట్‌..
భారత్‌-పాక్‌లో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలు భద్రతా దళాలపై ఆత్మాహుతి దాడు లకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అంచనా వేశాయి. దీంతో జమ్మూకాశ్మీర్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో హై అలర్ట్‌ జారీచేశారు. పంజాబ్‌లోని గుర్‌దాస్‌పుర్‌ జిల్లాలో రాత్రిపూట విద్యుత్‌ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ”గుర్‌దాస్‌పుర్‌ జిల్లావ్యాప్తంగా రాత్రి 9గం టల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు పూర్తిగా కరెంటు నిలిపివేయాలి. ఆస్పత్రు లు, సెంట్రల్‌ జైళ్లకు వీటి నుంచి మినహాయింపు ఉంది. అయినప్పటికీ నిర్దేశించిన సమయంలో జైలు, ఆస్పత్రుల కిటికీలు మాత్రం కచ్చితంగా మూ సి ఉంచాలి. అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడం లో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇవి అమల్లో ఉం టాయి” అని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. ఏదై నా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎదుర్కొనేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకున్నట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -