నవతెలంగాణ-హైదరాబాద్: క్షేత్రస్థాయిలో పనిచేసే ఉగ్రవాదుల కంటే వారిని నడిపిస్తున్న మేథో ఉగ్రవాదులు అత్యంత ప్రమాదకరమని ఢిల్లీ పోలీసులు ఉద్ఘాటించారు. దేశ రాజధాని ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లు, నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు ఘటన ఇందుకు నిదర్శమని.. పోలీసుల తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఢిల్లీ అల్లర్లు 2020కి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమామ్ సహా పలువురి బెయిల్ పిటిషన్లను ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు.
ఈ సందర్భంగా ఎస్వీ రాజు మాట్లాడుతూ.. వైద్యులు, ఇంజినీర్లు వంటివారు కొందరు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం కొత్త ట్రెండ్‌గా మారిందన్నారు. ఈ విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసుల తరఫున 5 అంశాలను లేవనెత్తారు ఏఎస్జీ.ఏఎస్జీ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. ఈ కేసుపై శుక్రవారం తదుపరి విచారణ చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది.



