నవతెలంగాణ హైదరాబాద్:కిచెన్ అప్లయెన్సెస్ విభాగంలో అగ్రగామిగా ఉన్న హింద్ వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ ఇటీవల అత్యంత సమర్థవంతమైన BLDC (బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్) మోటారుతో ఉండే చిమ్నీలు, అత్యాధునిక హాబ్ లు, అద్భుతంగా ఉండే కొత్త ఓవెన్లు స్టైలిష్ కిచెన్ సింక్ లు వంటి అన్ని రకాల అప్లయెన్సెస్ ను విడుదల చేసింది.
భారత స్థిరాస్తి మార్కెట్లో జరుగుతున్నా బలమైన వృద్ధికి అనుగుణంగా ఈ విస్తరణ సరైన సమయంలో వచ్చింది. ముఖ్యంగా వేగంగా పట్టణీకరణ చెందుతున్న ప్రాంతాలలో పెరుగుతున్న కొత్త ఇళ్ళ సంఖ్యతో పాటు కిచెన్ అప్లయెన్సెస్ రంగానికి గణనీయమైన ప్రేరణ లభించింది. పెరుగుతున్న డిస్పోజబుల్ ఆదాయాలు, అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల జీవనశైలి, ఆధునిక, టెక్నాలజీ ఆధారిత లివింగ్ స్పేస్, స్మార్ట్ హోమ్ పరిష్కారాల వైపు బలమైన మార్పు వంటి అంశాలు ఈ పెరుగుదలకు మరింత ఆజ్యం పోశాయి. టైర్-2, టైర్-3 నగరాలు ఇప్పుడు కీలక వృద్ధి కేంద్రాలుగా ఉన్నాయి, అధునాతన సౌకర్యాలు, ఎనర్జీ-ని సరిగ్గా ఉపయోగించే అప్లయెన్సెస్, హోమ్ ఆటోమేషన్ కోసం పెరుగుతున్న డిమాండ్ ను తెలియజేస్తున్నాయి, హింద్ వేర్ యొక్క అన్ని రకాల అప్లయెన్సెస్ శ్రేణి ఒక మంచి అవకాశాన్ని సృష్టిస్తున్నాయి.
హింద్ వేర్ హోమ్ ఇన్నోవేషన్ లిమిటెడ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ చౌదరి మాట్లాడుతూ, “కిచెన్ అప్లయెన్సెస్ విభాగంలో మా ఉనికిని బలోపేతం చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. స్థిరాస్తి వృద్ధి , ఈ తరం ఇంటి యజమానుల కొత్త కొత్త అభిరుచుల ప్రకారం భారతీయ గృహాలలో వస్తున్న మార్పులను అర్థం చేసుకున్న మేము స్మార్ట్ ఎనర్జీ–ఎఫిషియెన్సీ కిచెన్ అప్లయెన్సెస్ యొక్క సమగ్ర రకాలనురూపొందించాము. ఇవి అసమానమైన పనితీరు , మంచి డిజైన్ తో అందించడానికి జాగ్రత్తగా రూపొందించబడ్డాయి, భారతీయ వినియోగదారులకు వారు కోరుకునే తెలివైన, సమర్థవంతమైన , స్టైలిష్ పరిష్కారాలకు యాక్సెస్ ఉండేలా చూస్తాయి. కిచెన్ చిమ్నీలు , ఇతర అధునాతన కిచెన్ అప్లయెన్సెస్ పోర్ట్ఫోలియోను విస్తరించడంపై మా నిరంతర దృష్టి భారతీయ గృహాలలో ప్రతి రోజు వంట అనుభవాలను మార్చడానికి మా నిబద్ధతను చూపిస్తుంది.”
కొత్త BLDC మోటార్ మోడళ్లతో చిమ్నీ
నిజమైన పొగ లేని కిచెన్ ను అందించడానికి రూపొందించిన 12 కొత్త BLDC మోటారు-అమర్చిన మోడళ్లను బ్రాండ్ జోడించింది. చిమ్నీలలో టచ్-ఫ్రీ ఆపరేషన్ కోసం మోషన్ సెన్సార్ కంట్రోల్ , అప్రయత్న నిర్వహణ కోసం ఫిల్టర్-లెస్ థర్మల్ ఆటో-క్లీనింగ్ ఉన్నాయి. అవసరమైనప్పుడు పెరిగిన వెంటిలేషన్ కోసం, టర్బో స్పీడ్ ఫంక్షన్ ఎక్కువగా వచ్చిన వంట పొగలను కూడా త్వరగా తొలగిస్తుంది. ఈ చిమ్నీలకు 3 సంవత్సరాల కాంప్రిహెన్సివ్ వారంటీ , 12 సంవత్సరాల మోటార్ వారంటీ ఉన్నాయి, ఇది వినియోగదారులకు పూర్తి టెన్షన్ లేకుండా చేస్తుంది. 60 సిఎం, 75 సిఎం , 90 సిఎం పరిమాణాలలో లభించే ఈ శ్రేణి ఎంపికలు వివిధ రకాల కిచెన్ అవసరాలకు సరిపోతాయి.
కొత్త హాబ్స్ & ఓవెన్ లతో బిల్ట్–ఇన్ రేంజ్
ప్రీమియం బిల్ట్-ఇన్ శ్రేణి విస్తరణలో మార్కస్ 80 ఎల్ , ఒట్టావియో 44 ఎల్ బిల్ట్-ఇన్ ఓవెన్ లు ఉన్నాయి. మార్కస్ 80 ఎల్ ఓవెన్ టీమ్ అసిస్ట్ , ఎయిర్ ఫ్రైయర్ సామర్థ్యాలు వంటి అధునాతన టెక్నాలజీలతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది 16 వివిధ రకాల కుకింగ్ మోడ్ లను అందిస్తుంది, ఆరోగ్యకరమైన, మరింత రుచికరమైన భోజనాన్ని తయారు చేయడానికి , వారి మొత్తం వంట అనుభవాన్ని పెంచడానికి వినియోగదారులకు సాధికారత కల్పిస్తుంది.
ఇవానా ప్రో, ఇలారియా , ఇవానా నియో మోడళ్లతో సహా 20 అత్యాధునిక హాబ్ ఎస్కేయూలను కూడా బ్రాండ్ ప్రవేశపెట్టింది, ఇందులో స్పిల్-ప్రూఫ్ టెక్నాలజీ దాచిన బ్రాస్ బర్నర్లు, ఆటో-ఇగ్నీషన్, ఫ్లేమ్ గార్డ్ పాన్ సపోర్ట్ , వంట అనుభవాన్ని పెంచే ఫ్లేమ్ ఫెయిల్యూర్ సేఫ్టీ పరికరం ఉన్నాయి. హాబ్స్ వివిధ లేఅవుట్లతో , 2 నుండి 5 బర్నర్ కాన్ఫిగరేషన్లలో వస్తాయి.
కొత్త క్లాసిక్ సిరీస్ కిచెన్ సింక్స్ లాంచ్ చేయబడినవి
మాడ్యులర్ కిచెన్ డిజైన్లకు పెరుగుతున్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని హింద్ వేర్ తన క్లాసిక్ సిరీస్ కిచెన్ సింక్ లను కూడా విడుదల చేసింది. ఇంటి యజమానులు ఇప్పుడు మన్నికైన, అధిక-నాణ్యత కలిగిన , తక్కువ ఖర్చుతో కూడిన సింక్ ఎంపికలను పొందవచ్చు, ఇవి వారి కిచెన్ కి శాశ్వత , స్టైలిష్ మెరుగుదలను అందిస్తాయి.
వాటాదారుల నిమగ్నతను బలోపేతం చేసే నిరంతర ప్రయత్నాలలో భాగంగా, హింద్ వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ ఇటీవల పట్టాయా , బ్యాంకాక్ (థాయ్లాండ్) లో గ్రాండ్ సేల్స్ కాన్ఫరెన్స్ , గుర్తింపు కార్యక్రమాన్ని నిర్వహించింది, ఇందులో 200 మందికి పైగా ఉత్తమ పనితీరు కలిగిన ఛానల్ భాగస్వాములు , సేల్స్ ఉద్యోగులు పాల్గొన్నారు. కిచెన్ అప్లయెన్సెస్, సింక్స్, వాటర్ హీటర్స్ వంటి కేటగిరీల్లో రాబోయే ప్రొడక్ట్ ల రకాలను కూడా ఈ ఈవెంట్లో ప్రదర్శించింది.