Tuesday, May 20, 2025
HomeUncategorized'హిట్‌ 3' సూపర్‌ డూపర్‌ హిట్‌ ఖాయం

‘హిట్‌ 3’ సూపర్‌ డూపర్‌ హిట్‌ ఖాయం

- Advertisement -

‘ఇండిస్టీలో మేమంతా ప్రశాంతిని హిట్‌ మిషన్‌ అని పిలుస్తుంటాము. తను 100% సక్సెస్‌ఫుల్‌ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్‌. ఐదో సినిమాగా వస్తున్న ‘హిట్‌ 3′ కూడా అదే సక్సెస్‌ ట్రాక్‌లోకి వెళ్తుందని నాకు గట్టి నమ్మకం. నాని ఏ సినిమా చేసిన హిట్‌ అని తెలుస్తుంది. తన నుంచి నేను ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నా’ అని దర్శకుడు రాజమళి అన్నారు. నాని, శ్రీనిధిశెట్టి జంటగా నటించిన క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌ 3 : ది థర్డ్‌ కేస్‌’. డాక్టర్‌ శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్‌ పోస్టర్‌ సినిమా, నాని యూనానిమస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మే 1న పాన్‌ ఇండియాగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ, ‘చాలామంది ఫ్రాంచైజీలు క్రియేట్‌ చేస్తారు. కానీ అవి ఎంతకాలం ఉంటాయో తెలియదు. అయితే శైలేష్‌ క్రియేట్‌ చేసిన ‘హిట్‌’ ఫ్రాంచేజీ అంతకంటే ఎక్కువగా కొనసాగుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌ అన్నీ కూడా ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుందని వైబ్‌ని క్రియేట్‌ చేస్తున్నాయి’ అని తెలిపారు. ‘సినిమాల్లో ఏదైన ఒక రిఫరెన్స్‌ పాయింట్‌ మాట్లాడుకున్నప్పుడు రాజమౌళి సీన్‌లా ఉండాలి అని మాట్లాడుకుంటాం. అలాంటి ఒక సీక్వెన్స్‌ ఇందులో ఉంది. విశ్వక్‌సేన్‌, అడివిశేష్‌ ‘హిట్‌’ యూనివర్స్‌కి పిల్లర్స్‌. శైలేష్‌ స్ట్రెంత్‌ నాకు తెలుసు. మే1న మనం సినిమాని సెలబ్రేట్‌ చేసుకోబోతున్నాం. సినిమా మీద ఉన్న ప్రేమని ఇంకొక్కసారి గట్టిగా దేశం మొత్తం వినిపించేలాగా చూపిద్దాం. ఒక కమర్షియల్‌ మాస్‌, థ్రిల్లర్‌ ఫిల్మ్‌ కలిస్తే ఎలా ఉంటుందో ఇందులో చూస్తారు. అది చాలా రేర్‌ కాంబినేషన్‌. పవన్‌ కళ్యాణ్‌ స్టైల్‌లో చెప్పాలంటే ‘మనల్ని ఎవడ్రా ఆపేది. బ్లాక్‌బస్టర్‌’ కొడుతున్నాం అని చెప్పాల్సిందే’ అని హీరో నాని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -