Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeఆటలురోహిత్ శర్మ అరుదైన రికార్డు

రోహిత్ శర్మ అరుదైన రికార్డు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ ఐపీఎల్ 2025 సీజన్‌లో ఒకే మ్యాచ్‌లో రెండు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మెగా టోర్నీలో 7000 పరుగుల మైలురాయిని అందుకున్న రెండో ఆటగాడిగా, అలాగే 300 సిక్సర్లు బాదిన రెండో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌తో ముల్లాన్‌పూర్‌లో గత రాత్రి జరిగిన ఉత్కంఠభరిత ఎలిమినేటర్ మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనతలు సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు కేవలం 15 సగటుతో ఉన్న రోహిత్ శర్మ.. కీలకమైన నాకౌట్ పోరులో విశ్వరూపం ప్రదర్శించాడు. గుజరాత్ బౌలర్లపై ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగిన రోహిత్ 50 బంతుల్లోనే 81 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో నాలుగు భారీ సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉన్నాయి. రోహిత్ అద్భుత బ్యాటింగ్‌తో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad