- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హాలీవుడ్ సినీ ప్రపంచంలో ఓ శకం ముగిసింది. విఖ్యాత నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రపంచ ప్రఖ్యాత సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వ్యవస్థాపకుడు రాబర్ట్ రెడ్‌ఫోర్డ్ (89) కన్నుమూశారు. అమెరికాలోని ఉటాలో ఉన్న తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య మంగళవారం ఆయన నిద్రలోనే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు ఆయన ప్రతినిధి సిండి బెర్గర్ ధ్రువీకరించారు. మరణానికి గల కచ్చితమైన కారణాలను కుటుంబ సభ్యులు వెల్లడించలేదు.
- Advertisement -