- Advertisement -
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన హోంగార్డ్ సుర్వి వెంకటేశం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా,ఆయన కుటుంబానికి యాక్సిస్ బ్యాంక్ ద్వారా మంజూరైన రూ.34 లక్షల ప్రమాద బీమా చెక్కును మంగళవారం యాదాద్రిభువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయిన వారికి జీవిత బీమా సహాయం కొంతమేర ఆదరణనిస్తుందని తెలిపారు.బాధిత కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యాక్సిస్ బ్యాంక్ చౌటుప్పల్ బ్రాంచ్ మేనేజర్ టి.శ్రీనివాస్ క్లస్టర్ హెడ్ కొల్లు గోపికృష్ణతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



