- Advertisement -
- మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సన్మానం
నవతెలంగాణ-రెంజల్ :
మండల కేంద్రమైన రెంజల్ గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎంపికైన సర్పంచ్ ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులకు ఘనంగా సన్మానించారు. రెంజల్ సర్పంచ్ తిరుపతి లలిత హనుమాన్లు, ఉప సర్పంచ్ మానస రాకేష్, పాలకవర్గ సభ్యులకు పూల మాలలు వేసి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు అమ్రాది శేఖర్, గౌరవ అధ్యక్షులు సురేష్, ప్రధాన కార్యదర్శి సాయన్న, కోశాధికారి గానీ, ఉపాధ్యక్షులుగా ఆర్మూర్ సాయన్న, ఆర్మూర్ సంజీవ్, కస్పా హనుమాన్లు, లోలపు శ్రీనివాసులు, గణేష్, తదితరులు పాల్గొన్నారు
- Advertisement -



