Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం సాయంత్రం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. వివిధ కేటగిరిగా మండలంలోని ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న 17 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి ప్రశంస పత్రం, జ్ఞాపికతో ( మేమేంటో)పాటు  శాలువాతో  సత్కరించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా లయనన్స్ క్లబ్ కమ్మర్ పల్లి అధ్యక్షులు లుక్క గంగాధర్ మాట్లాడుతూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే గురుతార బాధ్యతను నెరవేస్తున్న ఉపాధ్యాయులను సత్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.కార్యక్రమంలో మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య, , కార్యదర్శి రేవతి గంగాధర్, క్యాషియర్ తెడ్డు రమేష్, ఉపాధ్యక్షులు సున్నం మోహన్, నోముల నరేందర్, కార్యవర్గం, సభ్యులు, తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -