Saturday, May 3, 2025
HomeUncategorizedబ్రిలియంట్ విద్యార్థులకు సన్మానం..

బ్రిలియంట్ విద్యార్థులకు సన్మానం..

నవతెలంగాణ – ఆర్మూర్ : పదవ తరగతి పరీక్షల్లో బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ నుండి మొత్తం 43 మంది విద్యార్థులు హాజరై, 43మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం గర్వకారణం. ఇందులో 31మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించినట్టు పాఠశాల కరస్పాండెంట్ రవికాంత్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను సన్మానించారు. బి.దాత్రిక 574/600 మార్కులతో, సిహెచ్ శివానంద్ 558/600, ఎ. లలిత్ శ్రీరామ్& వరలక్ష్మీ 558/600 మార్కులతో స్కూల్ టాపర్స్ గా నిలిచినట్టు తెలిపారు. విద్యార్థులు సాధించిన ఈ విజయం వారికి తోడుగా నిలిచిన తల్లిదండ్రులు, నిబద్ధతతో కృషి చేసిన ఉపాధ్యాయులకు, మరియు మా స్కూల్ టీమ్‌కు చెందింది. ఈ సందర్భంగా వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img