లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు..
మండల పరిషత్ మాజీ అద్యక్షులు జల్లిపల్లి
నవతెలంగాణ – అశ్వారావుపేట: చదువు ఏదైనా లక్ష్యంతో చదివితేనే సత్ఫలితాలు వస్తాయని, దీనికి క్రమశిక్షణ తోడైతే సంస్కారం అబ్బుతుంది అని మండల పరిషత్ మాజీ అద్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి అన్నారు. నియోజకవర్గ కేంద్రం అయిన అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధులను ఆయన శుక్రవారం అభినందించారు. పాఠశాల ప్రాంగణంలో 2024 – 2025 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో మండలంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించి, ప్రధమ, ద్వితీయ స్థానాలలో నిలిచిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించి, జ్ఞాపికలను అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే మంచి స్థాయికి చేరుకుంటారని, తల్లిదండ్రులు పిల్లల నుండి ఆశించేది డబ్బు ఇంకా వేరే దో కాదని అందరిలో మంచి పేరు తెచ్చుకొని వారికి మంచి పేరు తేవాలని, మంచి ప్రయోజకులు ఐతే ఆ తల్లిదండ్రులు పడే సంతోషం మాటల్లో చెప్పలేనిది అని వారు అన్నారు. అందుకే ప్రతి విద్యార్థి తమ కోసం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పడే కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని చదవాలని అన్నారు. అలాగే వచ్చే రెండూ సంవత్సరాలు ఇంటర్ లో మరింత కష్టపడి ఇష్టంతో చదవాలని ఎందుకంటే వచ్చే ఈ రెండు సంవత్సరాలే మీ విజయానికి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి ఇది ఒక అవకాశం ఆని అన్నారు. పదవి ఉన్నా లేకున్నా ప్రతి సంవత్సరం మార్కులు రాగానే గుర్తుంచుకునే ఆయనే ఫోన్ చేసి మార్కులు తెలుసుకొని విద్యార్థులను సన్మానించడం, ఉపాధ్యాయులను అభినందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సేవలకు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ప్రసాదరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండల రావు, కిశోర్, ప్రవీణ్, చలపతి రావు, రాంబాబు, సీఆర్పీ ప్రభాకర్ ఆచార్యులు, బీఆర్ఎస్ నాయకులు యుఎస్ ప్రకాశ్ రావు, మోటూరి మోహన్, శెట్టిపల్లి రఘురాం, ఆరేపల్లి గోవింద్ గంధం వెంకటేశ్వర రావు, మల్లికార్జున్ రావు పాల్గొన్నారు.
ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు సన్మానం..
- Advertisement -
RELATED ARTICLES