Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఇరాన్‌తో చర్చలు ఆశాజనకం: అమెరికా

ఇరాన్‌తో చర్చలు ఆశాజనకం: అమెరికా

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇరాన్‌తో చర్చలు ఆశాజనకంగా ఉన్నాయని అమెరికా రాయబారి పేర్కొన్నారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు ఆశాజనకంగా ఉన్నాయని, దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కోసం అమెరికా ఆశిస్తున్నట్లు పశ్చిమాసియా రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ మంగళవారం రాత్రి జాతీయ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఇరాన్‌తో మాట్లాడుతున్నామని, నేరుగానే కాకుండా మధ్యవర్తుల ద్వారా కూడా చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇరాన్‌ను తిరిగి యథాస్థితికి తీసుకువచ్చేలా దీర్ఘకాలిక శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉందని తాము ఆశిస్తున్నామని అన్నారు.

ఇరాన్‌, ఇజ్రాయిల్‌ల మధ్య కాల్పుల విరమణ బుధవారం నుండి కొనసాగుతోంది. సంపూర్ణంగా కాల్పుల విరమణకు ఇరు పక్షాలు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలోనే అమెరికా అతిపెద్ద సైనిక స్థావరాల్లో ఒకటైన ఖతార్‌లోని మిలటరీ స్థావరంపై సోమవారం రాత్రి ఇరాన్‌ పరిమిత స్థాయిలో క్షిపణుల దాడికి దిగిన కొద్ది గంటల్లోనే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad