Sunday, August 3, 2025
E-PAPER
Homeజాతీయంఛత్తీస్‌గఢ్‌లో దారుణం..78 మంది విద్యార్థులకు రేబిస్‌

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం..78 మంది విద్యార్థులకు రేబిస్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: వీధి కుక్క కలుషితం చేసిన కూరగాయలతోనే సిబ్బంది మధ్యాహ్న భోజనం తయారు చేసి విద్యార్థులకు వడ్డించిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బలోదబజార్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. జులై 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ఆహారాన్ని తిన్న 78 మంది విద్యార్థులకు యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.

పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వండిన కూరగాయలను వీధి కుక్క కలుషితం చేసింది. ఈ సంఘటన గురించి కొంతమంది విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. ఉపాధ్యాయులు ఆ ఆహారాన్ని వడ్డించవద్దని ఆదేశించినా, ఆహారం కలుషితం కాలేదంటూ సిబ్బంది విద్యార్థులకు వడ్డించినట్లు తెలిపారు. సుమారు 84మంది విద్యార్థులు ఆహారాన్ని తీసుకున్నారని అన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఈ ఘటన గురించి చెప్పారు. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్‌ను సంప్రదించారు. ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు భయంతో తమ పిల్లలకు సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో యాంటీ రేబిస్‌ టీకాను వేయించారు.

ముందు జాగ్రత్త చర్యగా యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారని, మొదటి మోతాదుతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని లచ్చన్‌పూర్‌ ఆరోగ్య కేంద్రం ఇన్‌చార్జ్‌ తెలిపారు. గ్రామస్తులు, తల్లిదండ్రులు మరియు పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యుల డిమాండ్‌ మేరకు వ్యాక్సిన్‌ ఇచ్చామని అన్నారు. సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌, బ్లాక్‌ విద్యా అధికారి, ఇతర అధికారులతో కలిసి ఈ దర్యాప్తు చేయడానికి పాఠశాలను సందర్శించారు. వారి పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యుల వాంగ్మూలాలను రికార్డు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -