- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రష్యాలోని ఉఫాలో ఓ కాలేజీలో యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు భారతీయ విద్యార్థులతో సహా పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఇండియన్ ఎంబసీ కూడా నలుగురు భారతీయ విద్యార్థులు గాయపడ్డారని ధ్రువీకరించింది. అధికారులు విద్యార్థులతో టచ్‌లో ఉండి, వారికి అవసరమైన సహాయం అందిస్తామని పేర్కొన్నారు. పోలీసులు దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -



