Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలువిద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం.!

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం.!

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం మండలంలోని పొట్టే వాని తండ గ్రామంలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. తండాకి చెందిన వికలాంగుడు రమావత్ బిచ్చు  అనే రైతుకు చెందిన ఇల్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోయింది. బిచ్చు కుటుంబ సభ్యులు ఉదయం కూలి పనులకు వెళ్లారు.అకస్మాత్తుగా ఇంట్లో నుంచి మంటలు ఎగసి పడటంతో అది చూసిన చుట్టుపక్కల వారు ఫైర్ సిబ్బంది కి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ రాకపోవడం తో గ్రామస్తులు ఎదో విదంగా మంటలను అదుపులోకి తీసుకొని వేరే ఇంటికి మంటలు వ్యాపించ కుండా  జాగ్రత్త పడ్డారు.

బాధితులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో దాచి ఉంచిన బియ్యం, ధాన్యం,ఫ్రిజ్,సామాన్లు కాలి పోయాయి.ఇల్లు అక్క డక్కడ రిపేర్ ఉండడం తో గత రెండు రోజుల క్రితం లక్ష రూపాయలు అప్పుగా తెచ్చి బాగుచేయటకు ఇంట్లో పెట్టుకున్నాడు.ఆ నగదు కూడా మంటల్లో కాలిపోగా సుమారు రూ.07 లక్షలవరకు ఆస్తి నష్టం జరిగిందని,ఈ ప్రమాదంలో ఇల్లు లోపల పూర్తిగా అగ్నికి ఆహుతి అవడంతో ఇంట్లో వస్తువులు మొత్తం కాలిపోయి బాధితులు కట్టుబట్టలతో మిగిలిపోయారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad