- Advertisement -
- పేదల ఇండ్ల కోసం సీపీఐ(ఎం) పాదయాత్ర..అడ్డుకున్న పోలీసులు
నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ లోని ఎల్బీనగర్ చౌరస్తాలో పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ డిమాండ్. ఈ మేరకు సోమవారం ఎల్బీ నగర్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు పాదయాత్రగా చేపట్టారు. పోలీసులు వారి పాదయాత్రను అడ్డుకొని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారితోపాటు రాష్ట్ర కమిటీ కమిటీ సభ్యులు భూపాల్, రంగారెడ్డి జిల్లా సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రమోహన్,డి జగదీష్, జిల్లా కమిటీ సభ్యులు గోరెంకల నర్సింహా, అల్లంపల్లి నరసింహ ఆదిభట్ల నాయకులు తులసిగారి నరసింహ, హయత్నగర్, కొత్త గణేష్ గౌడ్, తదితరులు ఉన్నారు.



- Advertisement -



