Wednesday, July 9, 2025
E-PAPER
Homeజాతీయంమిల్లు వర్కర్లకు ముంబైలోనే ఇండ్లు కట్టివ్వాలి..

మిల్లు వర్కర్లకు ముంబైలోనే ఇండ్లు కట్టివ్వాలి..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ముంబైలోని ఆజాద్ మైదానంలో బుధవారం “గిర్ని కంగర్ సంయుక్త లడా సమితి” ఆధ్వర్యంలో గిర్ని కంగర్ వారసుల లాంగ్ మార్చ్ ఘనంగా జరిగింది. మహామోర్చా ప్రధాన డిమాండ్ ముంబై బయట ఉన్న “వాంగిని” “సేలు” వంటి మారుమూల ప్రాంతాలలో కాకుండా, ముంబైలోనే ఎన్.టి.సి భూమిలో వారి కోసం ఇళ్ళు నిర్మించాలి. అయితే బిల్డర్లు తమకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని వక్తలు ఆరోపించారు. న్యాయవాది ఉదయ్ భట్, కామ్రేడ్ విజయ్ కులకర్ణి, కామ్రేడ్ ప్రకాష్ రెడ్డి, బాబన్ కాంబ్లే, అనేక మంది ఇతర నాయకులతో సహా కార్మిక సంఘాల నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ మహా ప్రదర్శనకు మహారాష్ట్రలోని అనేక గ్రామాల నుంచి వేలాది మంది కార్మికులు హాజరయ్యారు. ఈ ప్రభుత్వం అదానీ, అంబానీలకు అనుకూలంగా ఉందని ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, మిల్లు కార్మికులే మొదట పెన్షన్ల కోసం పోరాడినప్పటికీ, వారికి ఎనిమిది నుంచి పన్నెండు వందల రూపాయలు మాత్రమే పెన్షన్‌గా రావడం సిగ్గుచేటని ప్రకాష్ రెడ్డి అన్నారు. మొదట బాల్ నందగావ్‌కర్ సభలో ప్రసంగించగా, ఉద్ధవ్ ఠాక్రే, జితేంద్ర అవదా, అరవింద్ సావంత్, ఎమ్మెల్యే రోహిత్ పవార్, ఇతర రాజకీయ నాయకులు వచ్చి కార్మికులకు సంఘీభావం తెలిపారు.

మాజీ మంత్రి సచిన్ బహు నాయకత్వంలో రెండు లక్షల మంది మిల్లు కార్మికులకు ఇప్పటివరకు 15,000 ఇళ్లను మాత్రమే పంపిణీ చేశామని ఆయన అన్నారు. “మహాశక్తి మహామార్గం” కు బదులుగా మహారాష్ట్రలో కార్మికులకు ఇళ్ళు నిర్మించలేరా అనే ప్రశ్నను నాయకులు లేవనెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తమ డిమాండ్లను వినే వరకు ఆందోళన ఆగదని సచిన్ బహు సర్కార్ ను హెచ్చరించారు. తెలంగాణ లోని నిజామాబాద్, జగిత్యాల,కరీంనగర్, అదిలాబాద్ నుండి తెలుగు కార్మికులు హాజరు అయ్యారు వాళ్ల తరపున ఈ ర్యాలీలో ముంబై తెలుగు కార్మిక అధ్యక్షుడు గన్నారపు శంకర్ ప్రత్యేకంగా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -