నవతెలంగాణ – నసురుల్లాబాద్
మంజూరు కాబడిన ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని బీర్కూర్ ఎంపీడీవో మహెబూబ్ సూచించారు. సోమవారం ఎంపిడిఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించి. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడారు. మంజూరు అయిన అన్ని ఇండ్లకు వెంటనే ముగ్గులు వేయించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముగ్గులు పూర్తైన ఇండ్లకు బేస్మెంట్ స్థాయి వరకు పనులు పూర్తి చేసి, వచ్చే వారం లోపు ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం ఒక ఇంటిని గృహప్రవేశం కోసం సిద్ధం చేయాలని సూచించారు. ఇందిరమ్మ కమిటీలతో ప్రతి రోజూ సమీక్షలు నిర్వహించి, నిర్మాణం వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో పేర్కొన్నారు. అలాగే ఈ నెల చివరి నాటికి ఇంటి పన్ను వసూళ్లు 100 శాతం పూర్తి చేయాలని గ్రామ కార్యదర్శులకు ఆదేశించారు. ఈ కార్యాలయంలో మండల పరిధి గ్రామ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.
ఇండ్ల పనులు వేగవంతం చేయాలి: ఎంపీడీవో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES