నవతెలంగాణ-హైదరాబాద్: ఆసియా కప్ ఫైనల్లో ఓ నాటకీయ పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ట్రోఫీని, పతకాలను తన హోటల్‌కు ఎలా తీసుకెళ్తారు..? అంటూ బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రశ్నించారు. ఇది ఊహించని పరిణామం అని పేర్కొన్నారు. దీనిపై నవంబర్ మొదటి వారంలో దుబాయ్ వేదికగా జరిగే ఐసీసీ సమావేశంలో ఈ విషయంపై గట్టిగా నిరసన తెలుపుతామని ఆయన వెల్లడించారు.
పహల్గాం ఉగ్రదాడితో ఇరు దేశాల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసియా కప్ టీ20 టోర్నీలో విజేతగా నిలిచిన టీమ్‌ఇండియా.. ట్రోఫీ ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వి చేతుల మీదుగా తీసుకోవడానికి నిరాకరించింది . ఖాళీ చేతులతోనే విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఫొటోలకు ఫోజులిచ్చిన అనంతరం టీమ్‌ఇండియా జట్టు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.