– విద్యార్థుల సర్టిఫికెట్ల నిలిపివేతపై ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గౌతమి డిగ్రీ కాలేజీ, సుల్తాన్-ఉల్-ఉలూమ్ ఫార్మసీ కాలేజీలకు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) నోటీసులు జారీ చేసింది. ఫీజు రియంబర్స్‌మెంట్ అందలేదనే కారణంతో ఆయా కాలేజీల్లో చదువుకున్న కొంతమంది విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆపడం పట్ల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం విద్యా హక్కును ఉల్లంఘించడం అవుతుందని కమిషన్ పేర్కొంది. ఈనెల 28న రెండు కాలేజీల చైర్మెన్లు, ప్రిన్సిపాళ్లు కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. నోటీసుల ప్రతులు మేడ్చల్ కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి కూడా పంపినట్టు హెచ్‌ఆర్సీ అధికారులు తలిపారు. ఇది హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని నోటీసుల్లో గత ఆదేశాలను కమిషన్ గుర్తు చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి కేసులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
గౌతమి, సుల్తాన్-ఉల్-ఉలూమ్ కాలేజీలకు హెచ్‌ఆర్‌సీ సమన్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES