Wednesday, December 24, 2025
E-PAPER
Homeఖమ్మంహెచ్ఆర్ఎస్ ఉద్యోగి హుస్సేన్ కు బెస్ట్ ఫీల్డ్ స్టాఫ్ అవార్డ్

హెచ్ఆర్ఎస్ ఉద్యోగి హుస్సేన్ కు బెస్ట్ ఫీల్డ్ స్టాఫ్ అవార్డ్

- Advertisement -

– పలువురి అభినందనలు
నవతెలంగాణ – అశ్వరావుపేట

స్థానిక ఉద్యాన పరిశోధనా స్ధానం క్షేత్రస్థాయి ఉద్యోగి(ఏఈఓ) ఎండీ హుస్సేన్ కు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం బెస్ట్ ఫీల్డ్ అవార్డ్ ప్రకటించింది. ఈ విశ్వవిద్యాలయం 11 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ నెల 23 వ తేది మంగళవారం సిద్దిపేట జిల్లా ములుగు లో నిర్వహించిన వేడుకల్లో ఈ అవార్డ్ ను ఆయనకు బహూకరించారు.

ఉద్యాన పరిశోధన స్థానం అశ్వారావుపేట లో గత 18 ఏళ్ళుగా ఏఈఓ గా పని చేస్తున్న ఎండి హుస్సేన్ కు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ విశ్వ విద్యాలయం యూనివర్సిటీ చే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు రావటం స్థానిక ఉద్యాన పరిశోధన స్థానానికి మంచి పేరు తెచ్చిన ఎండి హుస్సేన్ ను స్టాఫ్ అందరూ అభినందించారు.

యూనివర్సిటీలో 1991 లో అటెండ్ గా ఉద్యోగం సాధించి, రికార్డు అసిస్టెంట్, ఆ తర్వాత అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గా పదోన్నతులు పొందారు. 2007 సంవత్సరం అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గా పదోన్నతి పొంది ఉద్యాన పరిశోధన స్థానం అశ్వారావుపేట లో విధులు నిర్వహిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -