కొత్త కోర్సుల ప్రవేశం, రికార్డు గ్రాడ్యుయేట్లు
నాణ్యతా ప్రమాణాల పెంపుకు చర్యలు
శాతవాహన యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవంలో వైస్-ఛాన్సలర్ ప్రొ. ఉమేష్ కుమార్
నవతెలంగాణ- కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
అమెరికాలోని తెలుగు ఎన్నారైల నుంచి యూనివర్సిటీకి భారీ స్థాయిలో విరాళాలు, దాతత్వం లభిస్తోందని అని శాతవాహన యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ (వీసీ) ప్రొఫెసర్ యు. ఉమేష్ కుమార్ తెలిపారు. యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవ వేడుకలో ఆయన తన నివేదికను సమర్పిస్తూ ప్రసంగించారు. ఉత్తర తెలంగాణ ఉన్నత విద్య కోసం యూనివర్సిటీ చేస్తున్న కషిని వివరించారు. డాక్టర్ సుధాకర్ రావు విడియాల వార్షిక లక్ష రూపాయల నగదు బహుమతితో గోల్డ్ మెడల్‌ను ఏర్పాటు చేయడమే కాక, ప్రతి సంవత్సరమూ ఐదుగురు విద్యార్థులకు తమ హైదరాబాద్ ప్లాంట్‌లో ఇంటర్న్‌షిప్‌లు ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు. డాక్టర్ బండారి సుధాకర్ తమ యూనివర్సిటీకి పది కంప్యూటర్లను ఉదారంగా స్పాన్సర్ చేశారు. డా. మనోహర్ శ్రీరామోజి ఐదేళ్లపాటు ఏటా రూ.2లక్షలు విరాళం ప్రకటించారని తెలిపారు. ఇలా పలువురు దాతల వివరాలు తెలిపారు.కొత్త కోర్సుల ప్రవేశం, రికార్డు గ్రాడ్యుయేట్లు2025-26 విద్యా సంవత్సరం నుంచి ఎం.ఫార్మసీ, ఎల్‌ఎల్‌బీ (3వైడీసీ) – 2 సెక్షన్లు, ఎల్‌ఎల్‌ఎం (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా) వంటి వత్తి విద్యా కోర్సులతో పాటు బి.టెక్. (సీఎస్‌ఈ, ఏఐ, ఐటీ, ఈసీఈ, బయో-టెక్నాలజీ) కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు.
2017-18 నుంచి 2022-23 మధ్య ఆరు విద్యా సంవత్సరాలలో 55,051 మంది అండర్-గ్రాడ్యుయేట్లు, 25,310 మంది పోస్ట్-గ్రాడ్యుయేట్లు పట్టాలు పొందారని తెలపారు. ఈమధ్యకాలంలో 24 మంది పరిశోధకులకు ప్రతిష్టాత్మక డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) డిగ్రీలు లభించాయని వివరించారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని గ్రామీణ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడానికి యూనివర్సిటీ అంకితభావంతో పనిచేస్తుందని వీసీ ఉద్ఘాటించారు.నాణ్యతా ప్రమాణాల పెంపుకు చర్యలువీసీగా తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విశ్వవిద్యాలయంలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. విద్యార్థులకు తరగతి గదిలో ఫేషియల్ బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల భద్రత కోసం అన్ని క్యాంపస్‌లలో 24/7 సీసీటీవీ (100 కెమెరాలద్వారా) నిఘా ఏర్పాటు చేశామన్నారు. 4 డిసెంబర్ 2024న ప్రారంభించిన నైపుణ్యాభివద్ధి కేంద్రం ద్వారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కెరీర్ గైడెన్స్ అందిస్తున్నామన్నారు. అదే రోజు నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 2వేల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 500 మందికి ఉద్యోగావకాశాలు లభించాయన్నారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ విద్యార్థులు జీప్యాట్ (119), నైపర్ (84) పరీక్షలలో అత్యధిక ర్యాంకులు సాధించి తెలంగాణలోనే రికార్డు సష్టించారని తెలిపారు.



